మదనపల్లె ఆగస్టు 6 : (gtvmedia)రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీలో జరిగిన అవినీతి అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించాలని మదనపల్లి నియోజకవర్గ వైసిపి ఇన్చార్జ్ నిషా ర అహ్మద్ డిమాండ్ చేశారు.
వైసీపీ రాష్ట్ర పార్టీ పిలుపుమేరకు మదనపల్లిలోనే వైసీపీ కార్యాలయం ఎదుట వైసీపీ యువజన విభాగం నాయకులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. నిస్సార్ అహ్మద్ మాట్లాడుతూ.. మూడున్నర లక్ష మంది మెగా డీఎస్సీ లో అభ్యర్థులు పరీక్షలు, అనర్హులందరికీ స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇచ్చి అవినీతికి తెర లేపారన్నారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రెండేళ్ల కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజల్లో చాలా వ్యతిరేకత వస్తోందని, వైసీపీ నాయకులు చేపట్టిన రిలే నిరాహార దీక్షకు అనూహ్య స్పందన వస్తోందన్నారు. కూటమిరపదం హామీ ఇచ్చిన విధంగా సూపర్ సిక్స్ పథకంలో నిరుద్యోగ భృతికి ఇంతవరకు చెల్లించలేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు షమీం అస్లాం, మానుజ, విఎస్ రెడ్డి, తాలే సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు
మెగా డీఎస్సీ అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించాలి
