మదనపల్లి ఆగస్టు 6 :(gtvmedia)నీట్ పరీక్షలు రాసి వాయిదా పడడంతో ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల కుటుంబాలను కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని ఏపీ స్టూడెంట్స్ జేఏసీ చైర్మన్ కృష్ణ యాదవ్ డిమాండ్ చేశారు. గురువారం స్థానిక ఎన్జీవో హోం లో ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ జేఏసీ అన్నమయ్య జిల్లా మహాసభ ఘణంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా విచ్చేసిన చైర్మన్ డి.వి క్రిష్ణ యాదవ్ గారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ విభజన హామీలు, ప్రత్యేక హోదా మరియు విద్యార్ధి సమస్యల మీద పోరాటం కొనసాగిస్తామని దేశంలో నీట్ పేపర్ లీకేజీ కి వ్యతిరేకం గా పోరాటం చేసిన విద్యార్థి నాయకుల మీద కేసులు ఎత్తివేసి, చనిపోయిన విద్యార్ధి నీ విద్యార్థుల కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర అధ్యక్షులు వి. ఉత్తన్న మాట్లాడుతూ రాష్ట్రంలో సంక్షేమ వసతి గృహా లలోకి మీడియా మరియు విద్యార్ధి సంఘాల నాయకుల కు అనుమతులు నిషేధం విధించడా న్ని తప్పు పట్టారు. వెంటనే ప్రభుత్వ అనుమతులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు అదే విధంగా మెడికల్ సీట్ల లో ప్రభుత్వం తెచ్చిన జీఓ నెంబర్ 102 ను రద్దు చేయాలన్నారు ఎందుకనగా ఉత్తర్వుల వల్ల బడుగు, బలహీన వర్గాల వారికి మెడికల్ సీట్ల విషయం లో అన్యాయం జరుగుతుందన్నారు. అదేవిధంగా రాష్టంలో మూసి వేసిన వసతి గృహాలను వెంటనే తెరచి విద్యార్థులను చేర్చు కొనేలా హాస్టల్స్ లో సీట్ల సంఖ్య తో పాటు పరిధి పెంచాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు, యువత డ్రగ్స్ కు వ్యతిరఖం గా పోరాటం చేయాలని పిలుపు ఇచ్చారు.
అదే విధంగా అన్నమయ్య జిల్లా నూతన అధ్యక్షులు గా టి. గంగరాజు, సోషల్ మీడియా కన్వీనర్ నరసింహులు, ఉపాధ్యక్షులు తేజ, కార్యదర్శి దుర్గ, మనోజ్, భార్గవ్, దాము, బెన్ని, నరసింహులు, రాకేష్, శరణ్ కుమార్,యూసఫ్ ఖాన్, గిరి లను ఎన్నుకొన్నారు. ఈ మహాసభలకు రాయలసీమ జిల్లా ల కన్వీనర్ అమర్ యాదవ్, రాజా, నంద్యాల జిల్లా వేణు రెడ్డి, తిరుపతి జిల్లా వెంకట్ గౌడ్, కడప జిల్లా గురు నాథ్, నాజబ్ ఖాన్ , చిత్తూరు జిల్లా అమరేష్ నాయక్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
