విద్యాశాఖ మంత్రి లోకేష్ ని విమర్శించే స్థాయి ద్వారకనాథ రెడ్డికి లేదు

మదనపల్లి ఆగస్టు 6: (gtvmedia)రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ని విమర్శించే స్థాయి తమ్మలపల్లి ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డికి లేదని టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి విమర్శించారు.

గురువారం బి.కొత్తకోటలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ…
విద్య ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ని రాజీనామా చేయమని అడిగే అర్హత, స్థాయి తంబళ్లపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు ద్వారకనాథరెడ్డికి లేదన్నారు. గత ప్రభుత్వంలో వారి నాయకుడు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలోని విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించడమే కాకుండా ఒక డీఎస్సీ కూడా నిర్వహించి ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయకపోగా రాష్ట్రంలో ఉన్నటువంటి అమర రాజా, అదాని, లులు, జాకీ పరిశ్రమలని అనేక రకాలుగా వైసీపీ ప్రభుత్వం పెట్టిన ఇబ్బందులకు ఇతర రాష్ట్రాలకు తరలిపోయాయిన్నారు. ఈ రాష్ట్రంలోని యువత ఉద్యోగ అవకాశాలు పోగొట్టుకోవడం నిజం కాదా అని ప్రశ్నించారు. యువతను డ్రగ్స్ కు బానిసలుగా చేసి వారి బంగారు భవిష్యత్తుతో ఆడుకున్నది మీరు కాదా అని ఆమె నిలదీశారు
ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా మీరు చేస్తున్న జెన్ జడ్ నిరసన కార్యక్రమాలకు ఎక్కడకూడా చదువుకున్న యువత మీకు మద్దతుగా బయటికి రావడం లేదని ఎద్దేవా చేశారు.

గత ప్రభుత్వ పాలనలో మీ కుటుంబానికి చెందిన ప్రజాప్రతినిదులపై అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయని 2024 ఎన్నికలలో మీ కుటుంబ సభ్యుల ఎన్నిక పైన కూడా మన ప్రాంతంలో నిజాయితీగా గెలవలేదని మాట్లాడుతున్నారని దానికి నైతిక బాధ్యత వహించి మీ ముగ్గరు ప్రజాప్రతినిధులు మన ప్రాంత ప్రజలకు క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు.

కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మెగా డీఎస్సీ పై మొదటి సంతకం చేసి 149 రోజులలోనే పారదర్శకంగా డీఎస్సీ ని నిర్వహించి 1650 ఉపాధ్యాయ ఉద్యోగాలు భర్తీ చేసిన ఘనత లోకేష్ గారిది అని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఎర్రగుడి సురేష్, చాంద్ భాషా, చంద్రమోహన్ రెడ్డి, మూగి రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *