మదనపల్లి: ఆగస్ట్ 5:(gtvmedia మదనపల్లి మండల వెలుగు కార్యాలయంలో జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ (పీడీ) ఆధ్వర్యంలో వెలుగు మహిళా సంఘాల సభ్యులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లాస్థాయి అధికారులు పాల్గొని మహిళా సంఘాల బలోపేతం, స్వయం ఉపాధి అవకాశాలు, ఆర్థిక స్వావలంబన, పొదుపు, బ్యాంకు రుణాల సద్వినియోగం, ప్రభుత్వ సంక్షేమ పథకాల వినియోగంపై సభ్యులకు అవగాహన కల్పించారు.

అలాగే మహిళా సంఘాలు చేపట్టే ఆదాయ వనరుల అభివృద్ధి కార్యక్రమాలను మరింత విస్తరించి, స్వయం ఉపాధి ద్వారా కుటుంబ ఆర్థిక స్థితిని మెరుగుపర్చుకోవాలని అధికారులు సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న వివిధ పథకాలను సద్వినియోగం చేసుకుని మహిళలు ఆర్థికంగా ఎదగాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో మండల స్థాయి వెలుగు సిబ్బంది, జిల్లాస్థాయి అధికారులు, మహిళా సంఘాల సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *