సైబర్ మోసాల పై అప్రమత్తంగా ఉండాలి

మదనపల్లి ఆగస్టు 5 : (gtvmedia)సైబర్ మోసాలపై ప్రజల అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ ధీరజ్ పేర్కొన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ

ఆదాయపు పన్ను శాఖ పేరుతో వాట్సాప్‌లో వచ్చే నకిలీ నోటీసుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి హెచ్చరించారు.

ఆ మెసేజ్‌లలో ఉండే అనుమానాస్పద లింకులు లేదా ఫైల్స్ (.zip, .exe) క్లిక్ చేస్తే ఫోన్ హ్యాక్ అయ్యి బ్యాంక్ ఖాతాలు క్షణాల్లో ఖాళీ అవుతాయి.

ఐటీ శాఖ ఎప్పుడూ వాట్సాప్ ద్వారా నోటీసులు పంపదు కాబట్టి, గుర్తుతెలియని నంబర్ల నుండి వచ్చే మెసేజ్‌లకు ఎట్టి పరిస్థితుల్లోనూ స్పందించవద్దు.

ఎవరైనా ఇటువంటి సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 టోల్ ఫ్రీ నెంబర్‌కు కాల్ చేయాలని లేదా www.cybercrime.gov.in పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని ఎస్పీ సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *