మదనపల్లె, ఆగస్టు 23: (gtvmedia)ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, స్వాతంత్ర్య సమరయోధుడు, ‘ఆంధ్రకేసరి’ టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి వేడుకలను మదనపల్లెలోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.

జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి, ఐపీఎస్ ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ (పరిపాలన) ఎం. వెంకటాద్రి ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ.. సైమన్ కమిషన్ వ్యతిరేక పోరాటంలో బ్రిటీష్ తుపాకీ తూటాలకు ఎదురొడ్డి నిలిచిన ధీరుడు టంగుటూరి ప్రకాశం పంతులు అని కొనియాడారు. ఆయన ధైర్యం, నిస్వార్థ ప్రజాసేవ నేటి సమాజానికి ఆదర్శప్రాయమని పేర్కొన్నారు.
దేశ స్వాతంత్ర్యం కోసం ప్రకాశం పంతులు చేసిన త్యాగాలు, ప్రజాసేవను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో రిజర్వ్ ఇన్స్పెక్టర్ (అడ్మిన్) యు. రంగనాథ్ బాబు, ఆర్ఎస్ఐలు శ్రీనివాస్, మగ్బుల్, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
