మదనపల్లె: (gtvmedia)మదనపల్లి పట్టణం 20వ వార్డుతో పాటు కొండమారిపల్లి గ్రామంలో “ఇంటింటికి సంక్షేమంతో… ఇంటింటికి తెలుగుదేశం” కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర టీడీపీ కార్యదర్శి పచ్చిపాల తులసి, రాష్ట్ర విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ పచ్చిపాల రామకృష్ణ పాల్గొని ప్రజలను కలిసి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. కొండమారిపల్లిలో బీసీ నాయకుడు జయరాం యాదవ్ ఆధ్వర్యంలో ఇంటింటికి తిరిగి ప్రజలను కలిసి ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *