ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులకు క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లో ఘన విజయం

లారే కన్సల్టింగ్ అండ్ టెక్నాలజీస్‌లో 25 మంది విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు

మదనపల్లె, ఆగస్టు 1: (gtvmedia)మదనపల్లెలోని ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లలో మరోసారి విశేష ప్రతిభ కనబరిచారు. ప్రముఖ లారే కన్సల్టింగ్ అండ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నిర్వహించిన క్యాంపస్ నియామక ప్రక్రియలో కళాశాలకు చెందిన 25 మంది విద్యార్థులు ఎంపికయ్యారు.

ఎంపికైన విద్యార్థులకు సంవత్సరానికి రూ.3.6 లక్షల (3.6 LPA) వేతన ప్యాకేజీతో ఉద్యోగ అవకాశాలు లభించాయి. ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యం ఎంపికైన విద్యార్థులను అభినందిస్తూ, వారి భవిష్యత్తు మరింత విజయవంతంగా ఉండాలని ఆకాంక్షించింది.

కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎస్. రామలింగారెడ్డి మాట్లాడుతూ, విద్యార్థులు తమ ప్రతిభతో ఉన్నత శిఖరాలను అధిరోహించి తల్లిదండ్రులకు, కళాశాలకు మంచి గుర్తింపు తీసుకురావాలని ఆకాంక్షించారు.

కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ, విద్యార్థుల కృషితో పాటు వారికి శిక్షణ అందించిన డీన్లు, విభాగాధిపతులు, అధ్యాపకులు, ట్రైనింగ్ అండ్ ప్లేస్‌మెంట్ బృందం సమిష్టి కృషి వల్లే ఈ విజయం సాధ్యమైందని పేర్కొన్నారు.

ఈ విజయానికి కృషి చేసిన ట్రైనింగ్ అండ్ ప్లేస్‌మెంట్ విభాగం సభ్యులు డా. డి. శ్రీనివాసులు రెడ్డి, డా. కిరణ్ కుమార్, సి. మనోజ్ కుమార్తో పాటు అన్ని విభాగాల ట్రైనింగ్ అండ్ ప్లేస్‌మెంట్ కోఆర్డినేటర్లను కళాశాల యాజమాన్యం ప్రత్యేకంగా అభినందించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *