మదనపల్లె నుండి కదిరి వరకు స్కేటింగ్ చేస్తూ విజయవంతంగా 79 కిలోమీటర్ల ప్రయాణాన్ని పూర్తి చేసిన చిన్నారి అనంత దక్షిత్కు హృదయపూర్వక అభినందనలు!
ఈ అద్భుతమైన ప్రయాణాన్ని ప్రారంభించిన సందర్భంగా తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు చిన్నారి అనంత దక్షిత్కు శుభాకాంక్షలు తెలిపారు.కదిరి శాసనసభ్యులు కందికుంట వెంకట ప్రసాద్ కదిరి నియోజకవర్గంలో ఘనంగా ఆహ్వానం పలికి విజయాన్ని అందించారు.
చిన్న వయసులోనే అసాధారణ ప్రతిభ, పట్టుదల, సంకల్పంతో ముందుకు సాగిన అనంత దక్షిత్కు భవిష్యత్తులో మరిన్ని విజయాలు వరించాలని ఆకాంక్షిస్తున్నాం.
చిన్నారి సాహసం… దేశానికి గర్వకారణం! 🇮🇳
