మదనపల్లె మండలంలో 27 ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలకు కేటాయింపులు ప్రకటన

మదనపల్లె, అక్టోబర్ 14: అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలంలోని ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. 2026 ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి జిల్లా కలెక్టర్ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్‌లో మొత్తం 27 ఎంపీటీసీ స్థానాల రిజర్వేషన్ల వివరాలను ప్రకటించారు.

మొత్తం 27 స్థానాల్లో 14 స్థానాలు అన్‌రిజర్వ్‌డ్‌ (జనరల్) కేటగిరీకి, 8 స్థానాలు బీసీలకు, 4 స్థానాలు ఎస్సీలకు, ఒక స్థానం ఎస్టీకి కేటాయించారు. మహిళల కోసం మొత్తం 13 స్థానాలను రిజర్వు చేశారు.

రిజర్వేషన్ల వివరాలు ఇలా ఉన్నాయి:

  • అన్‌రిజర్వ్‌డ్‌ (జనరల్): మదనపల్లె రూరల్, చీకలబైలు, సీటీఎం క్రాస్ రోడ్-1, ఈశ్వరమ్మ కాలనీ, కొత్తవారిపల్లె, కొల్లబైలు, రామచార్లపల్లె-2.
  • అన్‌రిజర్వ్‌డ్‌ మహిళలు: వైఎస్సార్ కాలనీ, వేమపల్లె, బసినికొండ, సీటీఎం, వలసపల్లె, అంకిశెట్టిపల్లె, రామచార్లపల్లె-1.
  • బీసీ జనరల్: సీటీఎం క్రాస్ రోడ్-2, పొన్నెపాలెం, కొత్తఇండ్లు-1, పెంచుపాడు.
  • బీసీ మహిళలు: బొమ్మనచెరువు, కొత్తఇండ్లు-2, దుబ్బిగానిపల్లె, మాలేపాడు.
  • ఎస్సీ జనరల్: పొతపోలు, తట్టివారిపల్లె.
  • ఎస్సీ మహిళలు: కొండమర్రిపల్లె, కొత్తపల్లె.
  • ఎస్టీ జనరల్: కురవంక.

రిజర్వేషన్ల ప్రకటనతో మదనపల్లె మండలంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఆయా స్థానాల్లో పోటీ చేయాలనుకునే ఆశావహులు రిజర్వేషన్ల ఆధారంగా తమ రాజకీయ సమీకరణాలను రూపొందించుకునే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *