మిట్స్‌లో పారిశ్రామిక శిక్షణా కార్యక్రమాలు, ఉద్యోగ అవకాశాలపై అతిథి ఉపన్యాస కార్యక్రమం.

మదనపల్లె సమీపంలో గల (మదనపల్లె ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్) మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీలోని ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ (ఈసీఈ) విభాగం వారు మిట్స్ అలుమ్ని వెల్ఫేర్ అసోసియేషన్ మరియు ఇండస్ట్రీ రిలేషన్స్ సెల్ వారి ఆధ్వర్యంలో విద్యార్థులకు “పారిశ్రామిక శిక్షణా కార్యక్రమాలు మరియు ఉద్యోగ అవకాశాలు” అనే అంశంపై అతిథి ఉపన్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బెంగళూరులోని కావోరా టెక్ గ్రూప్స్‌లో టీమ్ లీడర్‌గా పనిచేస్తున్న మిట్స్ పూర్వ విద్యార్థి బి. సంజీవ చైతన్య (2021–2025 బ్యాచ్) పాల్గొన్నారు. కార్యక్రమంలో బి. సంజీవ చైతన్య మాట్లాడుతూ, ప్రస్తుత పారిశ్రామిక రంగంలో విద్యార్థులు విజయవంతమైన కెరీర్‌ను నిర్మించుకోవడానికి అవసరమైన సాంకేతిక నైపుణ్యాలు, పారిశ్రామిక శిక్షణ ప్రాముఖ్యత, ఉద్యోగ నియామక ప్రక్రియలు, కెరీర్ అభివృద్ధి అవకాశాల గురించి వివరించారు. విద్యార్థులు తమ విద్యాభ్యాస సమయంలోనే పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడంతో పాటు, ప్రాజెక్టుల రూపకల్పన, ఆచరణాత్మక శిక్షణ, సమస్యల పరిష్కార సామర్థ్యంపై దృష్టి సారించాలని అన్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు కమ్యూనికేషన్ నైపుణ్యాలు, బృందంగా పనిచేసే సామర్థ్యం, సృజనాత్మక ఆలోచనా విధానాన్ని పెంపొందించుకోవాలని తెలిపారు. విద్యార్థులు పారిశ్రామిక రంగంలో వస్తున్న మార్పులను నిరంతరం గమనిస్తూ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంపొందించుకోవాలని తెలిపారు. విద్యాసంస్థల్లో పొందిన పుస్తక పరిజ్ఞానాన్ని ప్రాయోగిక అనుభవంతో అనుసంధానించుకోవడం ద్వారా వృత్తిపరమైన నైపుణ్యాలను పెంపొందించుకోవచ్చని తెలిపారు. పరిశ్రమలతో అనుసంధానం, శిక్షణా కార్యక్రమాలు, ప్రాజెక్టులు విద్యార్థులకు వాస్తవ పని పరిస్థితులపై అవగాహన కల్పించడంతో పాటు, భవిష్యత్తులో ఉన్నతమైన కెరీర్ అవకాశాలను పొందేందుకు దోహదపడతాయని తెలిపారు. కార్యక్రమంలో కావోరా టెక్ గ్రూప్స్‌ మేనేజర్ రెడ్డి శ్రీజ మరియు ప్రతినిధులు, అసిస్టెంట్ డైరెక్టర్-ఇండస్ట్రీ రిలేషన్స్ డాక్టర్ పి.ఎం బాలాజీ, విభాగాధిపతి డాక్టర్ సంజయ్ కుమార్ సి గౌర్, అల్యూమిని రిలేషన్స్ ఆఫీసర్ డాక్టర్ జి.నాగశ్వేత, కోఆర్డినేటర్ జి.చరణ్ కుమార్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *