కర్ణాటక సరిహద్దుల్లో చెక్‌పోస్టుల్లో ఎక్సైజ్ అధికారుల తనిఖీలు

మదనపల్లె అక్టోబర్ 22 : అన్నమయ్య జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కర్ణాటక సరిహద్దున ఉన్న చీకలబైలు, రామసముద్రం ఎక్సైజ్ చెక్‌పోస్టుల వద్ద తనిఖీలు ముమ్మరం చేశారు. Exice ఈఎస్ మధుసూదన్ ఆధ్వర్యంలో సిబ్బంది వాహనాలను తనిఖీ చేస్తున్నారు. కర్ణాటక నుంచి వచ్చే ప్రతి వాహనాన్ని ఆపి అక్రమ మద్యం తరలిస్తున్నారా అని పరిశీలిస్తున్నారు. 24/7 నిఘా కోసం అదనపు సిబ్బందిని ఏర్పాటు చేశారు. ఇద్దరు ఎక్సైజ్ ఎస్సైలు, ఎనిమిది మంది కానిస్టేబుళ్లు నిరంతరం తనిఖీలు చేస్తున్నారు. ఎన్నికల నియమావళి అమల్లో భాగంగా ఈ తనిఖీలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *