జిల్లా చుట్టూ 9 ప్రధాన చెక్ పోస్టుల ఏర్పాటు

మదనపల్లె, అక్టోబర్ 19: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అక్రమ నగదు, మద్యం, ఇతర ప్రలోభాల సామగ్రి రవాణాను అరికట్టేందుకు అన్నమయ్య జిల్లా పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు పొరుగు రాష్ట్రం, పక్క జిల్లాల నుంచి ఎటువంటి అవాంఛనీయ వస్తువులు జిల్లాలోకి ప్రవేశించకుండా సరిహద్దులను (బార్డర్లను) పూర్తిగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 9 వ్యూహాత్మక ప్రాంతాల్లో చెక్ పోస్టులను ఏర్పాటు చేసి ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు.

జిల్లాలోకి ప్రవేశించే ప్రతి వాహనాన్ని అణువణువూ క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే అనుమతిస్తున్నారు. కేవలం పోలీసులే కాకుండా.. రెవిన్యూ, ఇతర ప్రభుత్వ శాఖల అధికారుల సమన్వయంతో ఈ చెక్ పోస్టుల వద్ద ఉమ్మడిగా వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీల కోసం ఏపీఎస్పీ ప్రత్యేక బలగాలను సైతం రంగంలోకి దించారు. పొరుగు రాష్ట్రం కర్ణాటక నుంచి అక్రమ మద్యం, నగదు రాకుండా అడ్డుకునేందుకు అత్యధికంగా ఆ సరిహద్దు మార్గంలో 3 చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు.

కడప జిల్లా వైపు నుంచి వచ్చే వాహనాల పర్యవేక్షణకు 2 చెక్ పోస్టులు, చిత్తూరు జిల్లా సరిహద్దులో మరో 2 చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *