స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీని ఆదరించండి: దేవరింటి శ్రీనివాసులు

మదనపల్లె, ఆగస్టు 17: (gtvmedia)రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు తెలుగుదేశం పార్టీని ఆదరించాలని టీడీపీ మండల అధ్యక్షుడు దేవరింటి శ్రీనివాసులు కోరారు.

సోమవారం మదనపల్లె మండలంలోని కొండమరిపల్లి, మిట్టపల్లి గ్రామాల్లో నిర్వహించిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటింటికీ తిరుగుతూ టీడీపీ ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించి కరపత్రాలను పంపిణీ చేశారు.

దేవరింటి శ్రీనివాసులు మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ పథకాలు ప్రజల మన్ననలు పొందుతున్నాయని తెలిపారు.

కూటమి ప్రభుత్వంపై వైసీపీ నాయకులు చేస్తున్న దుష్ప్రచారాలను ప్రజలు తిప్పికొట్టాలని ఆయన కోరారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను ఆదరించి విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ క్లస్టర్ ఇన్‌చార్జి చల్లా శ్రీనివాసులు, జయరాం, గంగరాజు, రాజు తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *