అమరావతి: (gtvmedia)ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం తేదీని ప్రభుత్వం మరోసారి మార్చింది. తొలుత సెప్టెంబర్ 8న కేబినెట్ భేటీ నిర్వహించాలని నిర్ణయించగా.. అనంతరం దానిని సెప్టెంబర్ 2కు మార్చారు. తాజాగా మరోసారి తేదీని మారుస్తూ సెప్టెంబర్ 3న కేబినెట్ సమావేశం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై మంత్రివర్గం చర్చించనుంది. వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలు, ఇతర ముఖ్య ప్రతిపాదనలపై చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
కేబినెట్ భేటీ తేదీ వరుసగా మారుతుండటంతో సమావేశంలో తీసుకోబోయే నిర్ణయాలపై రాజకీయ, పరిపాలనా వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
