తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 24 గంటల సమయం

తిరుమల, ఆగస్టు 27: (gtvmedia)తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ పెరిగింది. గురువారం వైకుంఠంలోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోవడంతో భక్తులు బయట శిలాతోరణం వరకు క్యూలైన్లలో వేచి ఉన్నారు.

ఉచిత సర్వదర్శనం కోసం వచ్చే భక్తులకు సుమారు 24 గంటల సమయం పడుతున్నట్లు తిరుమల సమాచారం వెల్లడించింది. టైమ్‌స్లాట్ (SSD) టోకెన్ ద్వారా దర్శనానికి సుమారు 8 గంటలు, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సుమారు 5 గంటల సమయం పడుతోంది.

నిన్న 77,568 మంది భక్తుల దర్శనం

బుధవారం (ఆగస్టు 26) మొత్తం 77,568 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. అదే రోజు 35,033 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు.

శ్రీవారి హుండీ ద్వారా రూ.4.19 కోట్ల ఆదాయం సమకూరినట్లు తిరుమల సమాచారం పేర్కొంది.

భక్తుల రద్దీ నేపథ్యంలో దర్శనానికి వచ్చే భక్తులు తగిన సమయాన్ని కేటాయించుకుని తిరుమలకు రావాలని, టీటీడీ సూచనలు పాటిస్తూ సహకరించాలని అధికారులు కోరుతున్నారు.

ఓం నమో వేంకటేశాయ 🙏

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *