మదనపల్లి ఆగస్టు 17:( gtvmedia)సిపిఎస్ విధానం రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎస్ ఉద్యోగులు సెప్టెంబర్ 1వ తేదీన తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
సోమవారం స్థానిక ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయం వద్ద సిపిఎస్ ఉద్యోగుల అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు రాజేంద్ర కుమార్, కిల్లా నాగరాజు మాట్లాడుతూ .. సెప్టెంబర్ 1 ఛలో విజయవాడ పెన్షన్ విద్రోహ దినం కు భారీ సంఖ్యలో ఉపాధ్యాయ ఉద్యోగులు హాజరై విజయవంతం చేయాలని కోరారు…
5 సంవత్సరాల పాటు పదవి లో ఉండే MLA, MLC, MP లకు పాత పెన్షన్ ఇచ్చే ఈ ప్రభుత్వం.. 35 సంవత్సరాల పాటు ప్రభుత్వ ఉద్యోగం చేసిన ఉపాధ్యాయ ఉద్యోగులు కు పెన్షన్ లేకపోవడం దారుణమన్నారు.
రాష్ట్ర ఉపాధ్యక్షులు సొరకాయల శ్రీనివాసులు మాట్లాడుతూ..కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 1 సంవత్సరం లోపు సిపియస్ జిపియస్ రద్దు కు పరిష్కారం చూపిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో మాట ఇచ్చారని, కానీ 3 సంవత్సరాల పూర్తి అవుతున్న ప్రభుత్వంలో చలనం లేదన్నారు.
రాష్ట్ర ఆడిట్ కమిటీ చైర్మన్ రంజిత్ కుమార్, శీను.నరేష్ బాబు.. జిల్లా అసోసియేషన్ అధ్యక్షులు.. సుబ్బు RWS ఉద్యోగులు పాల్గొన్నారు
సెప్టెంబర్ 1న చలో విజయవాడ జయప్రదం చేయండి
