మదనపల్లి, ఆగస్టు 15: (gtvmedia)రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రెండేళ్లుగా అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలను చూసి టీడీపీని ఆదరించాలని రాజంపేట పార్లమెంట్ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు కోరారు.
శనివారం మదనపల్లి దేవత నగర్‌లో నిర్వహించిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ పథకాలతో టీడీపీ ప్రజల్లో ఆదరణ పొందుతోందని పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు కూటమి అభ్యర్థులకు అండగా నిలిచి, అఖండ మెజార్టీతో గెలిపించాలని సుగవాసి ప్రసాద్ బాబు విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు దేవరింటి శ్రీనివాసులు, పట్టణ అధ్యక్షుడు నాదెండ్ల అరుణ్ తేజ, విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ రామకృష్ణచారి, జిలాని, బాబునాయుడు,తదితరులు పాల్గొన్నారు.
