టమోటా మార్కెట్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

మదనపల్లి, ఆగస్టు 15: (gtvmedia)స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని టమోటా మార్కెట్ హమాలీ వర్కర్స్ యూనియన్ TNTUC ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా మండీ యూనియన్ గౌరవ అధ్యక్షులు సీ. జయరామిరెడ్డి, హమాలీ యూనియన్ గౌరవ అధ్యక్షులు ఎస్.ఏ. మస్తాన్ చేతుల మీదుగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జాతీయ జెండాకు వందనం చేసి, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు.

కార్యక్రమం అనంతరం యూనియన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. హమాలీ కార్మికులు, యూనియన్ ప్రతినిధులు, మార్కెట్ సిబ్బంది తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కార్మికుల ఐక్యత, సంక్షేమం కోసం TNTUC నిరంతరం కృషి చేస్తుందని యూనియన్ ప్రతినిధులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *