పీజీఆర్‌ఎస్ అర్జీలను సకాలంలో పరిష్కరించాలి

ఇన్‌చార్జి కలెక్టర్ శివ్ నారాయణ శర్మ ఆదేశం

మదనపల్లె, ఆగస్టు 10:( gtvmedia)ప్రజల నుంచి అందే పీజీఆర్‌ఎస్ అర్జీలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, నిర్ణీత గడువులోగా నాణ్యతతో పరిష్కరించాలని ఇన్‌చార్జి జిల్లా కలెక్టర్ శివ్ నారాయణ శర్మ అధికారులను ఆదేశించారు.

కెలెక్టర్ వారి కార్యాలయం

మదనపల్లె కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమంలో ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. అర్జీదారులు సంతృప్తి చెందేలా పారదర్శకంగా విచారణ జరిపి సమస్యలను పరిష్కరించాలని అధికారులకు సూచించారు. పెండింగ్, బియాండ్ ఎస్‌ఎల్‌ఏ, రీఓపెనింగ్ లేకుండా అర్జీలను పరిష్కరించాలన్నారు.

ఈ సందర్భంగా మొత్తం 345 అర్జీలు అందాయి. వాటిని సంబంధిత శాఖల అధికారులకు ఎండార్స్ చేసి, తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

అందిన ఫిర్యాదుల్లో రేషన్ కార్డులో పేరు మార్పు, దివ్యాంగుడికి మూడు చక్రాల వాహనం మంజూరు, ‘నేతన్న సేవలో’ పథకం కింద రూ.25 వేల ఆర్థిక సాయం తదితర అంశాలు ఉన్నాయి.

కార్యక్రమంలో సబ్‌ కలెక్టర్ చల్లా కళ్యాణి, డీఆర్వో వెంకటేష్, కేఆర్‌ఆర్‌సీ ఎస్‌డీసీ చంద్రశేఖర్ రెడ్డి, సర్వే శాఖ ఏడి శాంతరాజ్‌తో పాటు వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *