ఇంటింటికి సంక్షేమం.. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమానికి ప్రజల ఆదరణ
9, 10 వార్డుల్లో ఎమ్మెల్యే ఎం. షాజహాన్ బాషా పర్యటన – ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై అవగాహన
ఇంటింటికి సంక్షేమం

మదనపల్లి, ఆగస్టు 3: (gtvmedia)
మదనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 9, 10 వార్డుల్లో సోమవారం నిర్వహించిన “ఇంటింటికి సంక్షేమంతో – ఇంటింటికి తెలుగుదేశం” కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎం. షాజహాన్ బాషా స్థానిక కూటమి నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం గత రెండేళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, మదనపల్లి నియోజకవర్గంలో ప్రతి ప్రాంతంలో ప్రజలు తమకు ఆప్యాయంగా స్వాగతం పలుకుతున్నారని అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రభుత్వ పనితీరుపై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తూ, ఇదే ప్రభుత్వం కొనసాగాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు.
ప్రజల సమస్యలను స్థానికంగా తెలుసుకుంటూ, వాటి పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో టౌన్ బ్యాంక్ అధ్యక్షుడు నాదెండ్ల విద్యాసాగర్, వెంకటరమణ స్వామి దేవాలయం చైర్మన్ నవీన్ చౌదరి, టీడీపీ నాయకులు బాలు స్వామి, రాటకొండ మధు,వంటికొండ వెంకటేష్,వార్డు అధ్యక్షురాలు రాటకొండ భారతి, పట్టణ టీడీపీ అధ్యక్షుడు నాదెండ్ల అరుణ్, పెరవలి మధు, విజయమ్మ, నాగమణి, ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్మన్ నాదెండ్ల, ఇక్బల్తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
