లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా

మదనపల్లి, ఆగస్టు 3:( gtvmedia)
ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా మంజూరైన చెక్కులను మదనపల్లి ఎమ్మెల్యే ఎం. షాజహాన్ బాషా సోమవారం లబ్ధిదారులకు అందజేశారు.

మదనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డుకు చెందిన శారదకు రూ. 3,31,257 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కును స్థానిక కూటమి నాయకులతో కలిసి ఎమ్మెల్యే అందజేశారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పెంచుపాడు గ్రామానికి చెందిన లక్ష్మమ్మకు రూ. 47,884 విలువైన చెక్కును పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, పేద, మధ్యతరగతి కుటుంబాలకు వైద్య చికిత్స ఖర్చుల భారం తగ్గించడంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో ఉపయోగపడుతోందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో 9వ వార్డు నాయకురాలు రాటకొండ భారతి, పెరవలి మధు, నాగమణి, పెంచుపాడు టీడీపీ నాయకుడు స్వామితో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


వైద్య సహాయం కింద రూ.3.79 లక్షలకు పైగా ఆర్థిక సాయం అందజేత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *