మదనపల్లెలో విజ్‌మోని 361వ శాఖ ప్రారంభం

గోల్డ్ లోన్స్, ఫారెక్స్, మనీ ట్రాన్స్‌ఫర్, ట్రావెల్ సేవలు ఒకే చోట

మదనపల్లె, ఆగస్టు 10: (gtvmedia )ఆర్థిక సేవలను మరింత సులభతరం చేసే లక్ష్యంతో విజ్‌మోని (గతంలో యూనిమోని) మదనపల్లె పట్టణంలో తన 361 శాఖను ప్రారంభించింది.

సీటీఎం రోడ్డులోని రెవెన్యూ వార్డ్–15, డోర్ నెం. 15-6-1, మొదటి అంతస్తులో ఈ శాఖను ఏర్పాటు చేశారు. ఇక్కడ గోల్డ్ లోన్స్, ఫారెక్స్, అంతర్జాతీయ మనీ ట్రాన్స్‌ఫర్, ట్రావెల్ సేవలు అందుబాటులో ఉంటాయని సంస్థ ప్రతినిధులు తెలిపారు.

ఈ సందర్భంగా విజ్‌మోని సీఈఓ కృష్ణన్ ఆర్ మాట్లాడుతూ, మదనపల్లె ప్రాంత ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన, నమ్మకమైన ఆర్థిక సేవలను అందించేందుకు సంస్థ కట్టుబడి ఉందన్నారు.

ప్రభుత్వ పాఠశాలకు సీఎస్‌ఆర్‌ సేవలు

విజ్‌మోని సీఎస్‌ఆర్ కార్యక్రమంలో భాగంగా మదనపల్లెలోని చీకలగుట్ట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు వాటర్ డిస్పెన్సర్, స్కూల్ బ్యాగులు, విద్యా సామగ్రిని అందజేశారు.

దేశవ్యాప్తంగా 350కుపైగా శాఖల ద్వారా గోల్డ్ లోన్స్, ఫారెక్స్, మనీ ట్రాన్స్‌ఫర్, ట్రావెల్ తదితర సేవలను సంస్థ అందిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *