పుంగనూరులో ఆగస్టు 20న జాబ్ మేళా.. 500కు పైగా ఉద్యోగాలు

పోస్టర్ ఆవిష్కరించిన ఇన్‌చార్జి కలెక్టర్ శివ్ నారాయణ శర్మ

మదనపల్లె, ఆగస్టు 10: (gtvmedia)నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు APSSDC ఆధ్వర్యంలో ఆగస్టు 20 పుంగనూరులోజాబ్ మేళా–2026’ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా జాబ్ మేళా పోస్టర్‌ను అన్నమయ్య జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ శివ్ నారాయణ శర్మ సోమవారం ఆవిష్కరించారు.

MCV డిగ్రీ కళాశాలలో నిర్వహించే ఈ జాబ్ మేళాలో 10కి పైగా ప్రముఖ కంపెనీలు పాల్గొననుండగా, 500కు పైగా ఉద్యోగ ఖాళీలు అందుబాటులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. అభ్యర్థులకు వేదిక వద్దే నేరుగా ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు.

SSC, ITI, డిప్లొమా, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అర్హతలు కలిగిన ఫ్రెషర్స్‌తో పాటు అనుభవజ్ఞులు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఇన్‌చార్జి కలెక్టర్ సూచించారు.

జాబ్ మేళా వివరాలు

📅 తేదీ: ఆగస్టు 20, 2026
📍 వేదిక: MCV డిగ్రీ కళాశాల, పుంగనూరు
💼 ఉద్యోగాలు: 500+
🏢 కంపెనీలు: 10+
🎓 అర్హతలు: SSC / ITI / డిప్లొమా / గ్రాడ్యుయేషన్ / పోస్ట్ గ్రాడ్యుయేషన్
🎟️ ప్రవేశం: ఉచితం

కార్యక్రమంలో సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి, డీఆర్వో వెంకటేశు, జిల్లా ఉపాధి అధికారి, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎన్. శ్యామ్ మోహన్ తదితరులు పాల్గొన్నారు.

ప్రకటన విడుదల చేసిన వారు:
డీఐపీఆర్ఓ, అన్నమయ్య జిల్లా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *