చిన్నారి అనంత దక్షిత్‌కు మంత్రి మండిపల్లి, శ్రీరామ్ చినబాబు అభినందనలు

మదనపల్లి, ఆగస్టు 15: (gtvmedia)చిన్న వయసులోనే అసాధారణ ప్రతిభను ప్రదర్శించి 79 కిలోమీటర్ల స్కేటింగ్‌ను విజయవంతంగా పూర్తి చేసిన చిన్నారి అనంత దక్షిత్‌ను రాష్ట్ర మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి అభినందించి ఆశీర్వదించారు.

భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని చేపట్టిన 79 కిలోమీటర్ల స్కేటింగ్ ప్రపంచ రికార్డు ప్రయత్నాన్ని దక్షిత్ విజయవంతంగా పూర్తి చేశాడు. తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు పచ్చజెండా ఊపి ఈ స్కేటింగ్ యాత్రను ప్రారంభించారు.

ప్రయత్నాన్ని విజయవంతంగా పూర్తి చేసిన అనంతరం అనంత దక్షిత్‌ను మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి అభినందించారు. చిన్న వయసులోనే పట్టుదల, ఆత్మవిశ్వాసంతో ఇంతటి సాహసోపేతమైన లక్ష్యాన్ని సాధించడం అభినందనీయమని పేర్కొన్నారు.

మంత్రి అందించిన ప్రోత్సాహం, ఆశీర్వాదాలు చిన్నారి దక్షిత్‌కు మరింత ఉత్సాహాన్ని అందించాయి. భవిష్యత్తులో దక్షిత్ మరిన్ని విజయాలు సాధించి మదనపల్లి, అన్నమయ్య జిల్లా, ఆంధ్రప్రదేశ్‌కు మంచి పేరు తీసుకురావాలని మంత్రి ఆకాంక్షించారు.

79 కిలోమీటర్ల స్కేటింగ్‌ను విజయవంతంగా పూర్తి చేయడం ద్వారా చిన్నారి అనంత దక్షిత్ పలువురికి స్ఫూర్తిగా నిలిచాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *