మదనపల్లెలో కోలాహలం గా ఎంపీ మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు
మదనపల్లె సెప్టెంబర్ 11 : రాజంపేట పార్లమెంట్ సభ్యుడు పి.వి. మిథున్ రెడ్డి జన్మదినాన్ని వైఎస్ఆర్సిపి నాయకులు కోలాహలంగా నిర్వహించారు. శుక్రవారం పట్టణంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో మిథున్ రెడ్డి కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. మాజీ మునిసిపల్ వైస్ చైర్మన్ జింకా వెంకట చలపతి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మదనపల్లె నియోజకవర్గ సమన్వయకర్త ఎస్. నిసార్ అహ్మద్ ప్రారంభించారు.
“అన్ని దానాలలోకి రక్తదానమే మిన్న” అని అన్నారు. రక్తదాన శిబిరం వంటి సేవా కార్యక్రమంతో నిర్వహించడం ఎంతో అభినందనీయమన్నారు.యువత రక్తదానం వంటి సామాజిక సేవా కార్యక్రమాల్లో మరింత విస్తృతంగా భాగస్వాములు కావాలని
మిథున్ రెడ్డి యువతకు ఎంతో ప్రాధాన్యత ఇస్తూ, సేవా కార్యక్రమాలను ప్రోత్సహించే నాయకుడిగా నిలుస్తున్నారని నిసార్ అహ్మద్ అన్నారు.
ఆయన జన్మదినం సందర్భంగా నిర్వహించిన రక్తదాన శిబిరం ఎంతోమందికి స్ఫూర్తినిస్తుందని, రక్తం అవసరమైన సమయంలో ఒకరి ప్రాణాన్ని నిలబెట్టడంలో రక్తదాత పాత్ర ఎంతో గొప్పదని అన్నారు.
ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ మేధావుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి వి.ఎస్. రెడ్డి, డాక్టర్ అనిల్ కుమార్ రెడ్డి, లియాఖత్ అలీ ఖాన్, మాజీ కౌన్సిలర్లు ఎన్ . ఇర్ఫాన్ ఖాన్, బాలగంగాదర్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
