ఐదుగురు లబ్ధిదారులకు రూ.6.15 లక్షల ఆర్థిక సాయం అందజేసిన ఎమ్మెల్యే షాజహాన్ భాషా
మదనపల్లె, సెప్టెంబర్ 11: అనారోగ్యంతో బాధపడుతున్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) అండగా నిలుస్తోందని మదనపల్లె ఎమ్మెల్యే ఎం. షాజహాన్ భాషా పేర్కొన్నారు.
మదనపల్లి నియోజకవర్గానికి చెందిన ఐదుగురు లబ్ధిదారులకు మంజూరైన రూ.6.15 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను శుక్రవారం ఎమ్మెల్యే ఎం. షాజహాన్ భాషా అందజేశారు. ఆయా లబ్ధిదారుల పరిధిలోని కూటమి నాయకులతో కలిసి చెక్కులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా లబ్ధిదారులు తమ అనారోగ్య పరిస్థితుల్లో ఆర్థిక సహాయం అందించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఎమ్మెల్యే ఎం. షాజహాన్ భాషాకు కృతజ్ఞతలు తెలిపారు. తమ కుటుంబాలకు ప్రభుత్వం అందించిన ఈ సహాయాన్ని ఎప్పటికీ మరిచిపోలేమని, జీవితాంతం రుణపడి ఉంటామని హర్షం వ్యక్తం చేశారు.

అనారోగ్యంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు ప్రభుత్వం తరఫున సీఎం సహాయనిధి ద్వారా ఆర్థిక సహాయం అందించడం పేదలకు ఎంతో భరోసా కల్పిస్తోందని ఈ సందర్భంగా పలువురు పేర్కొన్నారు.
