రైతులకు సైలజీ గడ్డి పంపిణీ

మదనపల్లె సెప్టెంబర్ 11 : సంగం డెయిరీ చైర్మన్ దూళిపాళ్ల నరేంద్ర కుమార్ ఆధ్వర్యంలో రైతులకు సైలజి పంపిణీ చేశారు. శుక్రవారం మదనపల్లి మండలంలోని వలసపల్లి వద్ద ఉన్న సంఘం డైరీ వద్ద 30 మంది రైతులకు 25 టన్నుల సైలెజీ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సంగం డైరీ రీజనల్ మేనేజర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రస్తుత ఎల్నినో ప్రభావం వలన వర్షాలు పడక పశువులకు మేత లేక ఇబ్బంది పడుతున్నరన్నారు. రైతులను దృష్టిలో ఉంచుకుని సంగం డెయిరీ కి పాలు పంపుతున్న రైతులకు సైలేజ్‌ను సబ్సిడీపై అందించే నిర్ణయం తీసుకున్నారన్నారారు.
ఇందులో భాగంగా వలసపల్లి MCC పరిధిలో 25 టన్నుల సైలేజ్‌ను 30 మంది రైతులకు పంపిణీ చేసమన్నారు. ఈ సందర్భంగా రైతులకు కరవు పరిస్థితులలో సైలేజ్ ఉపయోగాలు మరియు సంగం ఫీడ్ & మినరల్ మిక్చర్ ప్రాముఖ్యత గురించి వివరించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో సంగం డియరి జోనల్ మేనేజర్ కోనేని ఆనంద కుమార్, వెటరినరీ డాక్టర్ డానియల్, సంగం డెయిరి సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *