బురకాయలకోటలో విషాదం.. యువకుడు బలవన్మరణం

ములకలచెరువు, సెప్టెంబర్ 19: అన్నమయ్య జిల్లా ములకలచెరువు మండలంలోని బురకాయలకోటలో శనివారం ఉదయం విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ యువకుడు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.

పోలీసుల కథనం మేరకు.. బురకాయలకోటకు చెందిన షేక్ ముబారక్ కుమారుడు షేక్ తాజుద్దీన్ (19) తల్లిదండ్రులతో కలిసి కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. అయితే ఏ కారణంతోనో తెలియదు కానీ జీవితంపై విరక్తి చెంది తాను నివాసం ఉంటున్న ఇంటిలోనే ఉరేసుకున్నాడు.

సమాచారం అందుకున్న ములకలచెరువు పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *