మదనపల్లి సెప్టెంబర్ 19: జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాలతో మదనపల్లెలోని జిల్లా పోలీసు కార్యాలయ పరిసరాల్లో శనివారం ‘స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర’ కార్యక్రమాన్ని నిర్వహించారు.
రిజర్వ్ ఇన్స్పెక్టర్ (వెల్ఫేర్) ఎం.రవికుమార్ గారి పర్యవేక్షణలో పోలీసు సిబ్బంది అంతా ఏకమై శ్రమదానం చేసి, కార్యాలయం చుట్టూ చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలు, పిచ్చిమొక్కలను పూర్తిగా తొలగించారు.
వర్షపు నీరు నిలిచి దోమలు వృద్ధి చెందకుండా గుంతలను మట్టితో పూడ్చివేసి, పరిసరాలను శుభ్రం చేశారు.
శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజారోగ్యానికి మేలు చేసే సామాజిక కార్యక్రమాల్లోనూ తాము ఎల్లప్పుడూ ముందుంటామని పోలీసు శాఖ స్పష్టం చేసింది.
