మదనపల్లి, ఆగస్టు 27: (gtvmedia)మదనపల్లి మున్సిపాలిటీ పరిధిలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ‘ఇంటింటికి తెలుగుదేశం’ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా 18, 21, 22వ వార్డుల్లో స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే యం. షాజహాన్ భాషా ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకున్నారు.
ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల వివరాలతో కూడిన కరపత్రాలను ప్రజలకు అందజేశారు.

ఎమ్మెల్యే షాజహాన్ భాషా మాట్లాడుతూ.. వార్డుల్లో పర్యటిస్తున్న సమయంలో ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందన్నారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని తెలిపారు. అదే సమయంలో ప్రజలు తన దృష్టికి తీసుకువచ్చిన స్థానిక సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
