ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలకు 60 మంది ఎంపిక

ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా అవార్డుల ప్రదానం

మదనపల్లె, సెప్టెంబర్ 3:
ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని అన్నమయ్య జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు–2026కు ఎంపికైన వారి జాబితాను విద్యాశాఖ అధికారులు విడుదల చేశారు. విద్యా రంగంలో విశేష సేవలు అందించిన ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులను ఎంపిక చేస్తూ డీఈఓ డాక్టర్.కే. సుబ్రహ్మణ్యం తుది జాబితాను ప్రకటించారు. జిల్లా వ్యాప్తంగా వివిధ విభాగాల్లో మొత్తం 60 మంది ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు.

వీరిలో నలుగురు ప్రధానోపాధ్యాయులు, 20 మంది స్కూల్‌ అసిస్టెంట్లు/పీజీటీలు, 30 మంది ఎస్జీటీలు, 6 గురు స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ విభాగం ఉపాధ్యాయులు ఉన్నారు.

హెచ్‌ఎంల విభాగం

ఎస్‌.మదన్‌మోహన్‌ (కన్నెమడుగు–తంబళ్లపల్లె), గుడిటి వెంకటేశ్వర (శెట్టిపల్లె కస్పా–సంబేపల్లె), షేక్‌ ఖలీల్‌బాషా (కోన–కలకడ), ముడే మోహన్‌నాయక్‌ (డైట్‌–రాయచోటి) ఎంపికయ్యారు.

స్కూల్‌ అసిస్టెంట్లు/పీజీటీలు

పి.లక్ష్మీనరసింహశాస్త్రి, వై.నాగశేషారెడ్డి, కె.సుబ్బారెడ్డి, ఎం.వెంకటరమణ, సి.హర్షవర్ధన్‌రెడ్డి, ఎం.గీతారాణి, షేక్‌ షర్ఫుద్దీన్‌, వి.రబ్బానీ, వి.ప్రసన్నకుమార్‌, కె.సుబ్రహ్మణ్యం, టి.లక్ష్మీరెడ్డి, సి.బాలాజీ, ఎం.కళావతి, జి.శివప్రసాద్‌, జి.చంద్రశేఖర్‌, బి.ఈశ్వరయ్య, ఎన్‌.రాధామణి, పి.మోహన్రావు, తిరువీధి ముని మనోహర్‌, ఎ.నటేశ్వరరావు అవార్డులకు ఎంపికయ్యారు.

ఎస్జీటీలు

ఎం.నాగేశ్వరనాయక్‌, షేక్‌ గౌహరిబేగం, పి.శారద, పి.వినోద, పి.వెంకటకల్యాణి, పి.వెంకటరమణ, రాయల మల్లికార్జున, మల్లిశెట్టి ఉదయ్‌కిరణ్‌, కె.సుధాకర్‌, ఎ.రజని, ఎస్‌.పి.సరిత, కె.సుభాషిణి, కె.విజయ్‌కుమార్‌, ముడే సరస్వతి, ఎం.శివగంగ, పులుపుటూరి సుజాత, ఎం.నవాజ్‌అలీఖాన్‌, రావూరి సుబ్రహ్మణ్యం, కె.వెంకటరమణ, మకరాజు భారతమ్మ, డి.ఆర్‌.నాగభూషణంనాయుడు, బి.శ్రీనివాసులు, ఇ.రమేష్‌బాబు, ఎ.శోభారాణి, ఎన్‌.అనిల్‌కుమార్‌, బి.హరిప్రసాద్‌, సి.సునీత, ఎస్‌.ముబారక్‌బాషా, ఎల్‌.రమాభార్గవి, బి.నర్సిరెడ్డి ఎంపికయ్యారు.

స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌

బి.మోహన్‌బాబు, కె.లక్ష్మీరెడ్డి, బి.భూపతి, షేక్‌ షమాభాను, జి.లలితమ్మ, డి.హిమవతి ఎంపికయ్యారు.

ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారికి ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా నిర్వహించే కార్యక్రమంలో జిల్లా ఉన్నతాధికారుల చేతుల మీదుగా పురస్కారాలు, ప్రశంసాపత్రాలు అందజేయనున్నట్లు అధికారులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *