అన్నమయ్య జిల్లా – మదనపల్లె:(gtvmedia )రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో ప్రశాంత వాతావరణం, శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి, ఐపీఎస్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీసులు ‘పల్లె నిద్ర’ కార్యక్రమం చేపట్టారు.

ఈ కార్యక్రమంలో భాగంగా పోలీసు అధికారులు, సిబ్బంది రాత్రి వేళల్లో గ్రామాల్లోనే బస చేసి స్థానిక ప్రజలతో మమేకమయ్యారు. గ్రామాల్లో శాంతిభద్రతల పరిస్థితిని సమీక్షించడంతో పాటు మహిళలు, చిన్నారుల రక్షణకు భరోసా కల్పించారు.
సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
గ్రామాల్లో అనుమానాస్పద వ్యక్తులు లేదా కొత్త వ్యక్తుల కదలికలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించి సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
