మదనపల్లె, ఆగస్టు 25: (gtvmedia)మిలాద్ ఉన్ నబి పర్వదినం సందర్భంగా అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ముస్లిం సోదర, సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు. పర్వదినాన్ని శాంతియుతంగా, భక్తిశ్రద్ధలతో, పరస్పర సౌభ్రాతృత్వంతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.
పండుగ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ప్రార్థనా స్థలాలు, మసీదుల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని, ట్రాఫిక్ నియంత్రణకు అవసరమైన చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులను ఎస్పీ ఆదేశించారు.
శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజలు పోలీసు శాఖకు సహకరించాలని కోరారు. ఎక్కడైనా అనుమానాస్పద పరిస్థితులు లేదా అవాంఛనీయ పరిణామాలు కనిపిస్తే వెంటనే డయల్ 100/112కు సమాచారం అందించాలని ఎస్పీ ధీరజ్ సూచించారు.
