మదనపల్లె స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు రాష్ట్రానికి ఆదర్శంగా నిలవాలి: ఎమ్మెల్యే షాజహాన్ భాషా

ఆగస్టు 15 వేడుకల ఏర్పాట్లపై సమీక్ష

మదనపల్లె, ఆగస్టు 8:( gtvmedia)మదనపల్లెలో జరగనున్న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా నిలిచేలా ఘనంగా నిర్వహించాలని ఎమ్మెల్యే యం. షాజహాన్ భాషా పిలుపునిచ్చారు.

ఆగస్టు 15న నిర్వహించనున్న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై శనివారం మదనపల్లె మున్సిపల్ కార్యాలయంలో ఎమ్మెల్యే సమీక్ష సమావేశం నిర్వహించారు. విద్యాశాఖ అధికారులు, వాలంటరీ ఆర్గనైజేషన్ల ప్రతినిధులు, పార్టీ నాయకులతో కలిసి కార్యక్రమ నిర్వహణపై చర్చించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, స్వాతంత్ర్య దినోత్సవం ప్రాముఖ్యతను ప్రతిబింబించేలా కార్యక్రమాలను ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలని సూచించారు. విద్యార్థులు, యువత, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనేలా కార్యక్రమాలను రూపొందించాలని అన్నారు.

పట్టణంలో వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లు, కార్యక్రమాల నిర్వహణ, ప్రజల భాగస్వామ్యం తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు. వేడుకలు విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని వర్గాలు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు.

ఈ సమావేశంలో విజయభారతి స్కూల్ ఛైర్మెన్ సేతు,బోర్డ్ సంస్థ సీఈఓ లలితమ్మ,విద్యాశాఖ అధికారులు, వాలంటరీ ఆర్గనైజేషన్ ప్రతినిధులు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *