ఎమ్మెల్యే షాజహాన్ బాషాను కలిసిన పుంగనూరు టీడీపీ ఇన్‌చార్జ్ మధుసూదన్ నాయుడు

మర్యాదపూర్వకంగా భేటీ.. పార్టీ అంశాలపై చర్చ

మదనపల్లె: సెప్టెంబర్ 5:ఇటీవల పుంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జిగా నియమితులైన మధుసూదన్ నాయుడు నేడు మదనపల్లె ఎమ్మెల్యే యం. షాజహాన్ బాషాను మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే షాజహాన్ బాషాతో మధుసూదన్ నాయుడు భేటీ అయి పరస్పరం అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. పుంగనూరు నియోజకవర్గంలో పార్టీ బలోపేతం, కార్యకర్తల సమన్వయం తదితర అంశాలపై ఇరువురు నాయకులు చర్చించినట్లు సమాచారం.

పార్టీకి సంబంధించిన ముఖ్యమైన అంశాలపై నాయకుల మధ్య జరిగిన ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *