బీటీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ‘నషాముక్త్ భారత్ అభియాన్’పై అవగాహన

మదనపల్లె, ఆగస్టు 12:( gtvmedia)మత్తుపదార్థాల వినియోగానికి విద్యార్థులు దూరంగా ఉండాలని బీటీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ గుత్తా గిరిబాబు పిలుపునిచ్చారు. బుధవారం కళాశాలలో ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విద్యాలయం ప్రతినిధుల ఆధ్వర్యంలో ‘నషాముక్త్ భారత్ అభియాన్’ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా డాక్టర్ గుత్తా గిరిబాబు మాట్లాడుతూ.. మత్తుపదార్థాల వినియోగం వల్ల ఆరోగ్యపరమైన సమస్యలతో పాటు వ్యక్తిత్వం, కుటుంబం, సమాజంపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందని వివరించారు. విద్యార్థులు మత్తుపదార్థాల జోలికి వెళ్లకుండా తమ భవిష్యత్తుపై దృష్టి సారించాలని సూచించారు.

అనంతరం ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విద్యాలయం ప్రతినిధులు విద్యార్థులు, కళాశాల సిబ్బందితో ‘నషాముక్త్ భారత్ అభియాన్’ ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *