మదనపల్లి ఆగస్టు 17: (gtvmedia)మదనపల్లి నియోజకవర్గంలో ఎల్లినో కారణంగా తాగునీటి బోర్లు అడుగంటి పోయాయని, నియోజకవర్గ వ్యాప్తంగా దాదాపు 100 బోర్లు ఎండిపోయాయని పేర్కొన్నారు. అయినా తాగునీటి ఎద్దడి రాకుండా చేసేందుకు ఒక దుకాణంలో ఒకటిన్నర కోటి రూపాయలు దాకా అప్పుచేసి బోరు మోటర్లు పైపులు దించి తాగునీటి సమస్య పరిష్కరిస్తున్నామన్నారు.
పంచాయతీ కార్యదర్శుల నుంచి కలెక్టర్ వరకు పారదర్శకంగా పాలన అందించాలని అన్నారు.
ప్రస్తుతం ఎస్పీడీసీఎల్ అధికారులు వ్యవసాయానికి 9 గంటలు నిరంతరం కరెంటు ఇస్తున్నారని, దీనివల్ల బోర్లు కూడా ఎండిపోతున్నాయన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం కనికరించి మూడు దశల్లో వ్యవసాయ విద్యుత్ సరఫరా చేయాలని ఎమ్మెల్యే కోరారు
#Madanapalle #ShajahanBasha #Assembly #Development #DrinkingWater
