మూడు నెలల క్రితం అదృశ్యం… అడవిలో శవమై లభ్యం

ఎర్రప్పగారిపల్లి సాఫ్ట్వేర్ ఉద్యోగి

నిమ్మనపల్లె, సెప్టెంబర్ 11 : మూడు నెలల క్రితం ఇంటి నుంచి అదృశ్యమైన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి.. సమీపంలోని అటవీ ప్రాంతంలో అస్తవమై కనపడ్డాడు. శవం బాగా కుళ్లిపోయి అస్తిపంజరమై తెలగ అతను ధరించిన దుస్తులతో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా గుర్తుపట్టారు.
గ్రామస్తుల కథనం మేరకు.. ఎర్రప్ప గారి పల్లి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి మనోహర నాలుగు నెలల క్రితం స్వగ్రామానికి వచ్చాడు. తిరిగి ఉద్యాన ఉద్యోగానికి వెళ్లకుండా ఇంటి దగ్గరే ఉండటంతో అతని తల్లిదండ్రులు మందలించారు.

దీంతో మనస్థాపన చెందిన మనోహర మొబైల్ ఫోను ఇంట్లోనే వదిలి ఇంటి నుంచి వెళ్లిపోయాడు.

చుట్టుపక్కల అతని కోసం గాలించిన తల్లిదండ్రులు కనపడకపోవడంతో నిమ్మనపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు.

శుక్రవారం గ్రామానికి చెందిన కొంతమంది అటవీ ప్రాంతంలో అస్తిపంజరంగా మారిన మనోహర్ని గుర్తించి పోలీసులకు తల్లిదండ్రులకు సమాచారం అందించారు.

ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *