మదనపల్లె, సెప్టెంబర్ 4 : ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా అన్నమయ్య జిల్లాకు చెందిన ముగ్గురు ఎంపికయ్యారు. బి కొత్తకోట జడ్పీ హైస్కూల్ కి చెందిన భాస్కర్ రెడ్డి, పెద్దమండ్యం వెలుగులు స్కూలు టీచర్ మధుకర్ రెడ్డి, రాయచోటి మండలం కే రామాపురం హై స్కూల్ టీచర్ రాజన్న రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు.
ఇది ముగ్గురు విజయవాడలో శనివారం నిర్వహించనున్న ఉపాధ్యాయ దినోత్సవం లో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా అవార్డు అందుకోనున్నారు.


