జలహారతి కార్యక్రమాన్ని నిర్వహించిన తంబళ్లపల్లి టీడీపీ ఇంచార్జ్ జి. శంకర్ యాదవ్
బి.కొత్తకోట, సెప్టెంబర్ 15: తంబళ్లపల్లి నియోజకవర్గం బి.కొత్తకోట మండలం టి.సదుం క్రాస్ వద్ద హంద్రీ–నీవా కాలువ ద్వారా వస్తున్న కృష్ణా జలాలకు ఘనంగా జలహారతి కార్యక్రమం నిర్వహించారు.
తంబళ్లపల్లి టీడీపీ ఇంచార్జ్ జి. శంకర్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కృష్ణా జలాలకు జలహారతి సమర్పించారు.
హంద్రీ–నీవా ద్వారా కృష్ణా జలాలు ఈ ప్రాంతానికి చేరుకోవడంపై నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి, రైతులకు సాగునీటి ప్రయోజనం కలగాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
