మదనపల్లె, సెప్టెంబర్ 10: ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేసేందుకు నిర్వహిస్తున్న గురువారం ప్రజా దర్బార్‌కు విశేష స్పందన లభించింది. మదనపల్లెలో ఎమ్మెల్యే యం. షాజహాన్ బాషా నివాసం వద్ద గురువారం నిర్వహించిన ప్రజా దర్బార్‌కు నియోజకవర్గంలోని నలుమూలల నుంచి ప్రజలు తరలివచ్చి తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.
ప్రజల నుంచి వచ్చిన వినతులను ఎమ్మెల్యే షాజహాన్ బాషా స్వయంగా విని, ఆయా సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. ప్రజల సమస్యలను పరిశీలించి, సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.
ప్రజలకు అందుబాటులో ఉండేలా నిర్వహిస్తున్న ప్రజా దర్బార్‌ను నియోజకవర్గ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా తన దృష్టికి తీసుకురావచ్చని తెలిపారు.
