మదనపల్లె సెప్టెంబర్ 10 : మదనపల్లె పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించేందుకు ఎమ్మెల్యే షాజహాన్ బాషా ద్విచక్ర వాహనంలో బయలుదేరారు. ఉదయం పట్టణంలోని నీరుగట్టు వారి పల్లి నుంచి చౌడేశ్వరి సర్కిల్ వరకు జరుగుతున్న రోడ్డు విస్తరణ పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. అక్కడ నుంచి ద్విచక్ర వాహనంలో సిటీఎం రోడ్డుకు వచ్చి అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించి పనులను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. Ctm రోడ్ లో జరుగుతున్న పనులకు ప్రజల వ్యాపారుల సహకారం చాలా అవసరమని ఎమ్మెల్యే కోరారు.

