ఏపీలో ఇద్దరు ఐపీఎస్‌ల సస్పెన్షన్ రద్దు.. రెండేళ్ల తర్వాత విధుల్లోకి

అమరావతి: సెప్టెంబర్ 4;కాదంబరి జెత్వానీ కేసులో సస్పెన్షన్‌కు గురైన ఐపీఎస్ అధికారులు కాంతి రాణా, విశాల్ గున్నిలకు ఏపీ ప్రభుత్వం ఊరట కల్పించింది. వారి సస్పెన్షన్‌ను రద్దు చేస్తూ వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ఉత్తర్వులు జారీ చేసింది.

2024 సెప్టెంబర్‌లో అధికార దుర్వినియోగం ఆరోపణలపై వీరిద్దరిపై సస్పెన్షన్ వేటు పడింది. జెత్వానీ అరెస్టు వ్యవహారంపై జరిగిన విచారణలో, ఎఫ్ఐఆర్‌కు ముందే అరెస్టు కోసం ఏర్పాట్లు చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది.

అయితే సస్పెన్షన్ రద్దయినప్పటికీ వారిపై కొనసాగుతున్న క్రమశిక్షణ, క్రిమినల్ విచారణలు యథావిధిగా కొనసాగుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.

మరోవైపు, జెత్వానీపై నమోదైన కేసులో సీఐడీ చేసిన కొన్ని ఆరోపణలను ఆమె ఖండిస్తూ, తనపై తప్పుడు కేసు పెట్టారని, తానే బాధితురాలినని పేర్కొంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *