నియమ నిబంధనల మేరకు వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసుకోవాలి

శాంతి కమిటీ మీటింగ్లో సబ్ కలెక్టర్ కళ్యాణి

మదనపల్లె, సెప్టెంబర్ 10 : వినాయక చవితి పండుగ సందర్భంగా మదనపల్లి డివిజన్లో యువకులు భక్తులు ప్రభుత్వం నియమ నిబంధనల మేరకు గణేష్ విగ్రహాలను ఏర్పాటు చేసుకోవాలని సబ్ కలెక్టర్ చల్ల కళ్యాణి పేర్కొన్నారు. గురువారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు. సబ్ కలెక్టర్ మాట్లాడుతూ గణేష్ మండపాల వద్ద అన్ని జాగ్రత్తలు పాటిస్తూ, ఉత్సవాలు నిర్వహించుకోవాలన్నారు. విద్యుత్ శాఖ, అగ్నిమాపక శాఖ, పోలీసు శాఖ అధికారులు నిరంతరం గణేష్ మండపాల వద్ద పర్యవేక్షించాలన్నారు. గణేష్ నిమజ్జనం సందర్భంగా ముందుగా కేటాయింపుల చెరువుల వద్ద నిమజ్జనం చేసుకోవాలని, ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని రెవెన్యూ శాఖను సబ్ కలెక్టర్ ఆదేశించారు.
డీఎస్పీ బుచ్చిరాజు మాట్లాడుతూ.. గణేష్ మండపాల వద్ద పెద్ద శబ్దంతో డీజేలు పెట్టకూడదని, రాత్రి 10 గంటల తర్వాత ఎలాంటి ఉత్సవాలు నిర్వహించరాదని సూచించారు. నిమజ్జనం ఊరేగింపు సందర్భంగా నిర్దేశించిన ప్రాంతాల్లో తక్కువ శబ్దంతో బ్యాండ్ మేళాలు ఉపయోగించుకోవాలని సూచించారు. ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరిగిన ఉత్సవ కమిటీల పై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *