యువత సన్మార్గంలో నడవాలి

STEP సీఈఓ ప్రసాద్ రావు

మదనపల్లి సెప్టెంబర్ 18 : ప్రస్తుత సమాజంలో యువత సన్మార్గంలో నడవాలని స్టెప్ సీఈఓ ప్రసాద్ రావు పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక జ్ఞానాంబిక డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం డిగ్రీ విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసం, కెరియర్ గైడేన్స్, డ్రగ్స్ నివారణ, వ్యక్తిగత నైపుణ్యాల పై అవగాహన సమావేశం నిర్వహించారు.
ప్రసాదరావు మాట్లాడుతూ.. విద్యార్థులు క్రమశిక్షణగా మెలిగితేనే, వారి నడవడిక బాగుపడి ఉన్నత చదువులకు తోడ్పాటు అందుతుందన్నారు. విద్యార్థి దశ నుంచే సమయపాలన పాటించాలి అన్నారు డు. డిగ్రీ తర్వాత చదువుకోవాల్సిన కోర్సుల గురించి ఇప్పటినుంచే తెలుసుకోవాలన్నారు. ఎక్సైజ్ ఎస్ఐ డోర్కాస్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డ్రగ్స్ నివారణకు ఎన్ డి పి ఎస్ చట్టాన్ని తీసుకొచ్చి కఠినంగా అమలు చేస్తున్నారన్నారు. విద్యార్థులకు మత్తుకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. స్టెప్ మేనేజర్ సుబ్బరాయుడు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం 15 నుంచి 21 సంవత్సరం మధ్య యువత కోసం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోందని.. ఇందులో భాగంగా అక్టోబర్ మొదటి వారంలో జిల్లాస్థాయి యువజన పోటీలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ ఆర్ గురు ప్రసాద్, ప్రిన్సిపాల్ రమాదేవి పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *