మదనపల్లె,సెప్టెంబర్:18 మదనపల్లె సమీపంలోని మదనపల్లె ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (మిట్స్) డీమ్డ్ టు బి యూనివర్సిటీలోని మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ (MCA) విభాగం ఆధ్వర్యంలో “గ్లోబల్ ఎడ్యుకేషన్ అండ్ కెరీర్ ఆపర్చునిటీస్: స్టడీ అండ్ వర్క్ అబ్రాడ్” అంశంపై అతిథి ఉపన్యాస కార్యక్రమం నిర్వహించారు.


కార్యక్రమానికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని షార్జా యూనివర్సిటీ సిటీలోని EMbriture సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మధుమితా ఎస్.ఆర్. ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు అంతర్జాతీయ విద్య, ఉద్యోగ అవకాశాలపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విదేశీ విశ్వవిద్యాలయాలు అందిస్తున్న స్కాలర్‌షిప్‌లు, ఉన్నత విద్యా అవకాశాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విదేశాల్లో చదువు, అంతర్జాతీయ కెరీర్ కోసం చివరి నిమిషంలో కాకుండా చదువు ప్రారంభ దశ నుంచే ప్రణాళికాబద్ధంగా సిద్ధం కావాలని అన్నారు.
విద్యార్థులు తమ కెరీర్ లక్ష్యాలను ముందుగా నిర్ధారించుకుని, వాటికి అనుగుణంగా కోర్సులు, విశ్వవిద్యాలయాలను ఎంపిక చేసుకోవాలని సూచించారు. విద్యార్హతలు, ఆసక్తి, కెరీర్ లక్ష్యాలకు అనుగుణంగా సరైన కోర్సు, యూనివర్సిటీ ఎంపికలో సహకారం అందిస్తామని తెలిపారు.
అంతర్జాతీయ అవకాశాలకు కేవలం మార్కులు మాత్రమే కాకుండా సాంకేతిక నైపుణ్యాలు, ప్రాజెక్టులు, ఇంటర్న్‌షిప్‌లు, సర్టిఫికేషన్లు, కమ్యూనికేషన్ స్కిల్స్, విజయాలతో సమగ్ర ప్రొఫైల్‌ను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. విదేశీ విశ్వవిద్యాలయాలకు దరఖాస్తు సమయంలో ప్రొఫెషనల్ రెజ్యూమ్, విద్యా ధ్రువపత్రాలు, ఇంటర్వ్యూ సన్నద్ధతకు ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు.
అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలతో పరస్పర సంబంధాలు, సమావేశాలు, అంతర్జాతీయ కార్యక్రమాలు, స్టూడెంట్ ఇమ్మర్షన్ ప్రోగ్రామ్‌లు, విద్యా–వృత్తిపరమైన సహకార అవకాశాలను విద్యార్థులు వినియోగించుకోవాలని సూచించారు.
కార్యక్రమంలో మిట్స్ ప్రిన్సిపాల్ డాక్టర్ పి. రామనాథన్, అసోసియేట్ డైరెక్టర్–ఇంటర్నేషనల్ రిలేషన్స్ యు. విజయలక్ష్మీ, MCA విభాగాధిపతి డాక్టర్ నవీన్ కుమార్, కోఆర్డినేటర్లు డాక్టర్ బి. నాగరాజన్, కె. కవితతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.
