బి.కొత్తకోట, ఆగస్టు 30:( gtvmedia)తంబళ్లపల్లె నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌గా తిరిగి నియమితులైన శంకర్ యాదవ్‌కు టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. ఆదివారం మదనపల్లె నుంచి బయలుదేరిన శంకర్ యాదవ్‌కు అంగళ్లు, బి.కొత్తకోట, ములకలచెరువు, తంబళ్లపల్లె మీదుగా పెద్దమండెం వరకు పార్టీ నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు. ఎరువులకోటకు చేరుకున్న ఆయనకు గజమాలలు వేసి ఘనంగా సన్మానించారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు రెండున్నరేళ్లకు శంకర్ యాదవ్‌ను తంబళ్లపల్లె నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌గా తిరిగి నియమించడంతో ఆయన వర్గీయుల్లో ఉత్సాహం నెలకొంది. పలుచోట్ల పార్టీ కార్యకర్తలు సంబరాలు నిర్వహించారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ అధిష్ఠానం శంకర్ యాదవ్‌కు బాధ్యతలు అప్పగించడంతో నియోజకవర్గంలోని టీడీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. పార్టీని మరింత బలోపేతం చేయడం, నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుని ముందుకు సాగడంపై శంకర్ యాదవ్ దృష్టి సారించనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఇదిలా ఉండగా, ఈరోజు సాయంత్రం లేదా సోమవారం మదనపల్లెలోని పార్టీ కార్యాలయంలో నియోజకవర్గంలోని ఆరు మండలాల టీడీపీ నాయకులు, కార్యకర్తలతో శంకర్ యాదవ్ సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం.
