మదనపల్లె, సెప్టెంబర్ 18: అన్నమయ్య జిల్లా పాఠశాలల క్రీడల సమాఖ్య కార్యదర్శిలుగా అంగళ్ళు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పీడీ చింతిర్ల రమేష్ బాబు, ఈడిగపల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పీడీ జయక్రిస్టీ ఎన్నికయ్యారు. పాఠశాల విద్య కమిషనర్ ఉత్తర్వులు మేరకు జిల్లా స్కూల్ గేమ్స్ కార్యదర్శులుగా నియమిస్తున్నట్లు డీఈవో సుబ్రహ్మణ్యం తెలియజేశారు
అదేవిధంగా వారి అభినందిస్తూ జిల్లాల్లో క్రీడల అభివృద్ధికి 14, 17 సంవత్సరముల బాలబాలికల జట్లను రాష్ట్రస్థాయిలో జాతీయస్థాయిలో నిలపాలని దిశ నిర్దేశం చేశారు. కార్యక్రమంలో పీడీలు అన్నమయ్య జిల్లా సంఘం కార్యదర్శి అన్సర్ భాష , కోశాధికారి బాలాజీ, రాష్ట్ర కౌన్సిలర్ విజయ్ కుమార్, మాజీ కార్యదర్శి నాగరాజు పాల్గొన్నారు.
జిల్లా స్కూల్ గేమ్స్ కార్యదర్శిలుగా రమేష్ బాబు, జయక్రిస్టీ
