శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని దర్శించుకున్న ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవన్

ప్రత్యేక పూజలు నిర్వహించిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు

శ్రీకాళహస్తి, ఆగస్టు 29: (gtvmedia)ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మాధవన్ శ్రీకాళహస్తికి విచ్చేసి శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా స్వామి, అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

మాధవన్‌కు దేవస్థానం అధికారులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామి, అమ్మవార్ల దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం వేద పండితులు ఆయనకు ఆశీర్వచనాలు అందించి, స్వామి, అమ్మవార్ల తీర్థప్రసాదాలను అందజేశారు.

ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈఓ బి.కె. వెంకటేశులు, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్, బోర్డు సభ్యురాలు కోలా వైశాలి, ప్రత్యేక ఆహ్వానితులు శైలజతో పాటు పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *